
మెగా నిర్మాత అల్లు అరవింద్ 1500 కోట్లతో రామాయణం సినిమాకు ప్లాన్ చేశాడు. ఏడాది పైగా వార్తల్లో ఉన్న ఈ సినిమాకు రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు మధు వంతెన, నమిత్ మల్ హోత్రా ఇద్దరు దర్శకులు డైరెక్ట్ చేస్తున్నారు. 3 భాగాలుగా రానున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కిస్తారట. ఇదంతా బాగుంది కాని ఇంతకీ ఈ సినిమాలో రాముడు ఎవరు అన్నది ప్రేక్షకుల్లో ఎక్సైటింగ్ గా మారింది.
నిర్మాత అల్లు అరవింద్ కాబట్టి రాం చరణ్ ఈ సినిమాలో రాముడిగా నటిస్తాడని అనుకోగా. చరణ్ తనకు కుదరదని చెప్పాడట. ఇక ఈ ప్రాజెక్ట్ లో రాముడిగా నటించే సత్తా ఉన్న మరో నటుడు తారక్. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో రాముడిగా నటిస్తాడని అంటున్నారు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న తారక్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే మెగా రామాయణంలో నయనతార మాత్రం సీతగా సెలెక్ట్ అయ్యిందట. మరి ఈ ప్రాజెక్ట్ లో ఎంతమంది స్టార్స్ నటిస్తారో చూడాలి.