ఏజెంట్ ఆత్రేయకు సీక్వల్

తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం యువ టాలెంట్ అదరగొడుతుంది. కొత్త దర్శకులు తమ ప్రతిభతో అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, బ్రోచేవారెవరురా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. స్వరూప్ డైరక్షన్ లో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా ఆడియెన్స్ ను అలరించింది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు.

ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో కూడా చర్చలు జరిగాయంటే సినిమా ప్రభావం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాకు సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నాడట డైరక్టర్ స్వరూప్. ఈ సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరిస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యిందని తెలుస్తుంది. మరి ఈ సీక్వల్ లో నవీన్ నటిస్తాడా లేక నాని ఆ ఛాన్స్ అందుకుంటాడా తెలియాల్సి ఉంది.