విజయ్ దేవరకొండ హీరో కాకుంటే..!

యువ హీరో విజయ్ దేవరకొండ అతి తక్కువ సినిమాలతోనే స్టార్ రేంజ్ అందుకున్నాడు. పెళ్లిచూపులు హిట్ అవగా అర్జున్ రెడ్డి అతనికి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచింది. ఇక గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాల ఫలితాలు అతనికి మరింత జోష్ తెచ్చాయి. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో బ్రేకప్ సినిమా చేస్తున్నాడు. దీనితో పాటుగా ఆనంద్ అన్నామలై డైరక్షన్ లో హీరో టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు.

విజయ్ తర్వాత అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ దోరసాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దేవరకొండ ఇమేజ్ ఏమాత్రం వాడుకోనని చెబుతున్న ఆనంద్ అన్న విజయ్ గురించి చాలా విషయాలు చెప్పాడు. విజయ్ హీరో అవడం కోసం చాలా కష్టాలు పడ్డాడని.. చాలా ఆడిషన్స్ కు వెళ్లి వెనుతిరిగాడని అన్నాడు. ఒకవేళ హీరో కాకుండా విజయ్ డైరక్టర్ గా అయినా సినిమాలు చేసే వాడు తప్ప ఇండస్ట్రీని వదిలి వెళ్లే వాడు కాదని అన్నాడు ఆనంద్. ఒకవేళ హీరోగా క్లిక్ అవకుంటే విజయ్ దేవరకొండ డైరక్టర్ అయ్యేవాడన్నమాట.