
ఈమధ్య టాలీవుడ్ లో హాలీవుడ్ సినిమాల తాకిడి ఎక్కువైందని చెప్పొచ్చు. స్టార్స్ అంతా తమ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తెలుగు మార్కెట్ పై హాలీవుడ్ సినిమాలు కన్నేశాయి. ఈమధ్యనే అవెంజర్స్ ఎండ్ గేమ్ తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఆ తర్వాత అల్లాయుద్దిన్ సినిమా కూడా తెలుగులో భారీగా రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడమే కాదు ఆ సినిమాల మీద హైప్ తెచ్చేందుకు మన తెలుగు యాక్టర్స్ తో ఆ సినిమాలోని పాత్రలకు డబ్బింగ్ చెప్పిస్తున్నారు.
అవెంజర్స్ ఎండ్ గేమ్ లో రానా డబ్బింగ్ చెప్పగా.. అల్లాదిన్ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు డబ్బింగ్ చెప్పారు. ఇక త్వరలో రిలీజ్ కాబోతున్న లయన్ కింగ్ సినిమాకు న్యాచురల్ స్టార్ నాని డబ్బింగ్ చెప్పాడు. సినిమాలో సింబా పాత్రకు నాని డబ్ చెప్పాడు. నేను సింబా ముఫాసా కొడుకుని అంటూ నాని డబ్బింగ్ మొదలు పెట్టగా సినిమాలో సన్నివేశాలు వస్తున్నాయి. జూలై 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న లయన్ కింగ్ సినిమాకు రవి శంకర్, జగపతి బాబు, బ్రహ్నానందం, ఆలి వంటి స్టార్స్ డబ్బింగ్ చెప్పడం విశేషం.