
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో చేస్తున సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ సినిమా చేస్తున్నాడు బన్ని. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుందట. ఈ సినిమాలో బన్ని డ్యుయల్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది. అందుకే ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారట. ఇక అందులో ఒక హీరోయిన్ గా రాశి ఖన్నా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. యువ హీరోలతో పాటుగా స్టార్స్ తో జోడీ కడుతున్న రాశి ఖన్నా తొలిప్రేమ, జై లవ కుశ తర్వాత కాస్త వెనక పడ్డది.
అయితే తనకు ఛాన్సులు రాకపోడానికి కారణం తన లుక్ అని కనిపెట్టిన రాశి ఖన్నా ఈమధ్య చాలా సన్నబడ్డది. తన హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తున్న రాశి ఖన్నా ప్రస్తుతం నాగ చైతన్యతో వెంకీమామ సినిమాలో నటిస్తుంది. అది కాకుండా సాయి ధరం తేజ్ ప్రతిరోజు పండుగే సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఈ రెండు సినిమాల కన్నా బన్ని ఐకాన్ ఛాన్స్ రాశి ఖన్నాకు మరింత క్రేజ్ తెచ్చిపెడుతుంది. మరి బన్ని, రాశి కాంబినేషన్ ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి.