మూడు భాగాలుగా మెగా 'రామాయణం'

రామాయణ గాధతో ఎన్ని సినిమాలు వచ్చినా మరోసారి రామయణాన్ని భారీ ఎత్తున తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు మెగా నిర్మాత అల్లు అరవింద్. రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ పై ఎనౌన్స్ మెంట్ వచ్చినా ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. లేటెస్ట్ గా ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. ఇప్పటివరకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారని తెలుస్తుంది. మల్టీ లాంగ్వేజెస్ లో ఈ రామాయణం సినిమా తెరకెక్కుతుందట.

సినిమా మొత్తం మూడు భాగాలుగా తీస్తారని తెలుస్తుంది. టైటిల్ తో పాటుగా నటీనటుల ఎంపిక ఇంకా జరగలేదట. అయితే ఈ సినిమాను డైరెక్ట్ చేసే దర్శక ద్వయం మాత్రం ఫైనల్ అయ్యారు. దంగల్ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన నితీష్ తివారితో పాటుగా శ్రీదేవి సినిమా మామ్ డైరెక్ట్ చేసిన రవి ఉద్యావర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారట. ఈ హై బడ్జెట్ మూవీ విజువల్ వండర్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఈ సినిమాకు మధు వంతెన, నమిత్ మల్ హోత్రా సహ నిర్మాతలుగా ఉంటున్నారు. త్రీడి టెక్నాలజీలోనే ఈ సినిమా తెరకెక్కిస్తారని తెలుస్తుంది.