ఇన్ స్టాగ్రాంలోకి చరణ్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇన్ స్టాగ్రాం ఎంట్రీ ఇచ్చాడు. ఇన్నాళ్లు అఫిషియల్ గా ఫేస్ బుక్ మాత్రమే హ్యాండిల్ చేస్తున్న రాం చరణ్ ఫైనల్ గా ఇన్ స్టాగ్రాంలో అడుగుపెట్టాడు. ఇదవరకు ట్విట్టర్ ఎకౌంట్ ఉన్నా అది క్లోజ్ చేశాడు. ఈరోజు చరణ్ ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ క్రియేట్ చేశాడు. ఇలా వచ్చాడో లేదో అప్పుడే 50 వేలమంది ఫాలోవర్స్ వచ్చారు. టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా రాం చరణ్ కు ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. 

ప్రస్తుతం రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ తో పాటుగా తారక్ కూడా నటిస్తున్నాడు. సెలబ్రిటీస్ ట్విట్టర్, ఇన్ స్టాగ్రాంల ద్వారా తమ ఫ్యాన్స్ కు మరింత అందుబాటులో ఉంటున్నారు. ముఖ్యంగా ఇన్ స్టా ఎకౌంట్ లో సెలబ్రిటీస్ తమ ఫోటోలు, వీడియోలతో లక్షల మంది ఫాలోవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు. స్టార్ హీరోల క్రేజ్ కు ట్విట్టర్, ఇన్ స్టా ఫాలోవర్స్ లెక్క కూడా రికార్డులు సృష్టిస్తుంది.