
సౌత్ లో క్రేజీ బ్యూటీ సమంత అక్కినేని కోడలిగా మారాక కూడా వరుస సక్సెస్ లను అందుకుంటుంది. ఆల్రెడీ ఈ ఇయర్ మజిలీతో సూపర్ సక్సెస్ అందుకున్న సమంత రీసెంట్ గా ఓ బేబీ అంటూ వచ్చి మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ గా వచ్చిన ఓ బేబీ సినిమాలో సమంత నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో కూడా ఇక తను సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేస్తానని తనకు చాలా సంతృప్తి ఇచ్చిన సినిమా ఓ బేబీ అని అన్నారు.
ఇక కెరియర్ లో ఎంతోమంది స్టార్స్ ఎంతోమంది దర్శకులతో పనిచేసిన సమంత తనకు మాత్రం ఓ ఇద్దరి దర్శకులతో వర్క్ చేయాలని ఉందని చెప్పింది. సౌత్ క్రేజీ డైరక్టర్ మణిరత్నం డైరక్షన్ లో ఓ సినిమా చేయాలని ఆయన సినిమాల్లో హీరోయిన్స్ కు స్పెషల్ లుక్ ఉంటుందని అన్నారు సమంత. ఇక తెలుగులో శేఖర్ కమ్ముల డైరక్షన్ లో ఓ సినిమా చేయాలని ఉందని అన్నారు సమంత. కమ్ముల సినిమాలు ఎలాంటి హడావిడి లేకుండా సినిమాల్లో పాత్రలు నటించడం కాదు జీవిస్తున్నాయి అనేలా డైరెక్ట్ చేస్తాడు. అందుకే శేఖర్ కమ్ముల డైరక్షన్ లో సినిమా చేయాలని కోరిక బయట పెట్టింది సమంత. కమర్షియల్ సినిమాల కన్నా సమంత దగ్గరకు ఫీమేల్ సెంట్రిక్ సినిమా కథలే ఎక్కువ వస్తున్నాయని తెలుస్తుంది.