
రౌడీ హీరో విజయ్ దేవరకొండలో ఎమోషనల్ యాంగిల్ కూడా ఉందా.. అతను కూడా ఏడుస్తాడా.. వీటన్నిటికి సమాధానం నిన్న జరిగిన దొరసాని ఈవెంట్ లో దొరికింది. ఎప్పుడు చాలా జోవియల్ గా మాట్లాడే విజయ్ దేవరకొండ తన తమ్ముడు సినిమా ఈవెంట్ లో మాత్రం చాలా ఎమోషనల్ అయ్యాడు. తను సినిమాల్లో ప్రయత్నిస్తున్నప్పుడు తనని, తన ఫ్యామిలీని యూఎస్ లో జాబ్ చేస్తూ ఆదుకున్నాడని అన్నాడు విజయ్.
సడెన్ గా ఒకరోజు జాబ్ వదిలేసి ఇంటికొచ్చి సినిమాలు చేస్తా అన్నాడు. అప్పుడు తమ్ముడు నిర్ణయం నాకు నచ్చలేదు. అందుకే తన సినిమా నుండి వచ్చిన ఏ అప్డేట్ కు తాను రెస్పాండ్ అవలేదని చెప్పాడు విజయ్. ఇక ఫైనల్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాలని తనని అడిగితే సినిమా చూసి నచ్చితేనే వస్తానని చెప్పా.. అలానే సినిమా చూసి నచ్చింది కాబట్టే వచ్చానని అన్నాడు విజయ్ దేవరకొండ.
ఇండస్ట్రీలో చాలా అవమానాలు.. ట్రోలింగ్స్.. మంచి.. చెడు అన్ని ఉంటాయి ఇవన్ని తట్టుకుని ధైర్యంగా నిలబడాలు అందుకే తన ప్రాజెక్ట్ విషయంలో తానేమి జోక్యం చేసుకోలేదని. ఫైనల్ గా సినిమా చూశాక తమ్ముడిని చూసి గర్వంగా ఉందని అన్నాడు విజయ్. సినిమాలో హీరోయిన్ గా నటించిన శివాత్మిక కూడా చాలా బాగా చేసిందని. దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్రా ఓ మంచి స్టోరీ టెల్లర్ అని ప్రశంసించాడు విజయ్. తనకు సూటయ్యే కథ ఉంటే తీసుకురా అని కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.