
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి టాకీ పార్ట్ పూర్తయింది. అక్టోబర్ 2న రిలీజ్ ఫిక్స్ చేసిన సైరా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివ డైరక్షన్ లో సినిమా లైన్ లో పెట్టాడు. భరత్ అనే నేను తర్వాత చిరు సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు కొరటాల శివ. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారని ఫైనల్ చేశారట. ఆల్రెడీ సైరా నరసింహా రెడ్డి సినిమాలో కూడా చిరు పక్కన నటిస్తుంది నయన్. ఇప్పుడు మరోసారి చిరుతో జోడీ కట్టే ఛాన్స్ దక్కించుకుంది. సీనియర్ స్టార్ హీరోలైన బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో ఆల్రెడీ సినిమాలు చేసిన నయనతార చిరుతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయడం విశేషం.
కొరటాల శివ సినిమాలో చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఒక హీరోయిన్ గా నయనతార ఓకే అవగా సెకండ్ హీరోయిన్ గా అనుష్క, శృతి హాసన్ ఇద్దరిలో ఒకరు ఫైనల్ అవుతారని తెలుస్తుంది. మొత్తానిక్ మెగా ఫ్యాన్స్ కు మెగా ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు మెగా బాస్ చిరంజీవి.