కుమారి సీక్వల్ లో దొరసాని

తెలుగులో తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా రావడం చాలా అరుదు. ఇదవరకుతో పోల్చితో ఇప్పుడు బెటర్ అయితే స్టార్ హీరోల తనయులు హీరోగా ఎంట్రీ ఇస్తారు కాని తనయురాళ్లు మాత్రం అందుకు సుముఖంగా ఉండరు. స్టార్స్ కన్నా వారి ఫ్యాన్స్ అందుకు ఒప్పుకోరు. అయితే ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తూ మెగా ఫ్యామిలీ నుండి నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు సినిమాతో తెరంగేట్రం చేసిన నిహారిక హీరోయిన్ గా 3 సినిమాలు చేసినా వర్క్ అవుట్ కాలేదు.

ఇక ఇప్పుడు అదే పంథాలో రాజశేఖర్ కూతుళ్లు హీరోయిన్ గా తమ లక్ టెస్ట్ చేసుకోనున్నారు. జీవిత రాజశేఖర్ ల పెద్ద కూతురు శివాని 2 స్టేట్స్ సినిమాలో నటిస్తుండగా చిన్న కూతురు శివాత్మిక దొరసాని సినిమాలో నటిస్తుంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన దొరసాని సినిమా టీజర్, ట్రైలర్ మెప్పించాయి. సినిమా ఈవెంట్ కు స్పెషల్ గా వచ్చిన డైరక్టర్ సుకుమార్ దొరసానిగా శివాత్మిక ఎక్స్ ప్రెషన్స్ అద్భుతమని పొగిడాడు.

అయితే సుకుమార్ కన్నుల్లో పడ్డ శివాత్మికకు లక్కీ ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. ఆయన నిర్మాతగా కుమారి 21ఎఫ్ 2 సినిమా చేస్తుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా శివాత్మికను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. దొరసానిగా మంచి రోల్ చేసిన శివాత్మిక కుమారిగా గ్లామర్ షో చేస్తుందా అంటూ కొందరు డౌట్ పడుతున్నారు. హెబ్భా లా రెచ్చిపోదు కాని సుకుమార్ ఓకే అంటే మాత్రం శివాత్మిక కుమారి సీక్వల్ కు సరే అనేట్టు ఉందట.