ఓ బేబీకి సమంత సెంటిమెంట్..!

అక్కినేని కోడలు సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. మజిలీతో హిట్ అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మజిలీ సినిమా ముందు ఫాలో అయిన ఓ సెంటిమెంట్ ఓ బేబీ రిలీజ్ ముందు కూడా ఫాలో అవుతుంది. అదేంటి అంటే మజిలీ సినిమాకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత ఓ బేబీ రిలీజ్ ముందు కూడా అక్కడకు వెళ్లి దర్శనం చేసుకుంది. 

అది కూడా అలిపిరి మెట్ల దారి గుండా సమంత దర్శనానికి వెళ్లడం విశేషం. దారిలో అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సరదాగా ఆమె ప్రయాణం సాగిందట. సమంతతో పాటుగా తమిళ నటి, వీడియో జాకీ రమ్య సుబ్రమణియన్ కూడా నడకదారిన శ్రీవారి దర్శనానికి వెళ్లింది. సమనతో ఈ జర్నీ చాలా స్పెషల్ అంటూ రమ్య ట్వీట్ చేసింది. 

మజిలీ ముందు తిరుమల నడకదారిన వెళ్లింది సమంత. ఆ సినిమా సూపర్ హిట్ అవగా ఇప్పుడు ఓ బేబీ కోసం కూడా సమంత తిరుమల వెళ్లింది. మరి ఓ బేబీ కూడా ఆ రేంజ్ హిట్ అవుతుందేమో చూడాలి. ఒకవేళ ఓ బేబీ కూడా సూపర్ హిట్టైతే తన ప్రతి సినిమాకు ముందు సమంత తిరుమల దర్శనం చేసుకోవడం ఖాయం.