'రావణ' పాత్రలో కళ్యాణ్ రామ్..!

నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ప్రయోగాలకు సిద్ధమయ్యాడు. అందుకే తను కూడా డిఫరెంట్ సబ్జెక్టులతో సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన 118 సినిమాతో హిట్ అందుకున్న కళ్యాణ్ రాం ఈసారి రావణగా రాబోతున్నాడు. నూతన దర్శకుడు వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కళ్యాణ్ రాం కెరియర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతుంది. ముందు ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్ అనుకున్నారు. అయితే ఆ టైటిల్ వల్ల మతపరమైన సమస్యలు వస్తాయని దాన్ని మార్చేశారు.   

వెండితెర మీద రావణ పాత్ర అంటే ఆ సీనియర్ ఎన్.టి.ఆర్ ఆ తర్వాత జూనియర్ ఎన్.టి.ఆర్ గుర్తుకొస్తారు. జై లవ కుశలో రావణ పాత్ర చేసిన తారక్ దుమ్ముదులిపేశాడు. ఆ సినిమాలో మూడు పాత్రల్లో ఎన్.టి.ఆర్ చేసిన రావణ పాత్రకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు అదే రావణ టైటిల్ తో కళ్యాణ్ రాం సిద్ధమవుతున్నాడు. ఈమధ్య కళ్యాణ్ రాం కూడా నటనలో పరిణితి చెందాడు.

మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కళ్యణ్ రాం ఈ రావణతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి. సెట్స్ మీద ఉన్న ఈ సినిమాతో పాటుగా కళ్యాణ్ రాం శతమానం భవతి డైరక్టర్ సతీష్ వేగ్నేశ డైరక్షన్ లో కూడా సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ముహుర్తం పెట్టుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. ఆ సినిమాలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది.