నాగార్జునతో పూజా హెగ్దె

కింగ్ నాగార్జున తన సినిమాల వేగం పెంచాడు. దేవదాస్ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న నాగార్జున ప్రస్తుతం మన్మధుడు 2 సినిమా చేస్తున్నాడు. చిలసౌతో ప్రతిభ చాటిన రాహుల్ రవింద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ కాగా ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ ఇద్దరు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో బంగార్రాజు సినిమా చేస్తున్నాడు నాగార్జున.

సోగ్గాడే చిన్ని నాయనా సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాలో నాగార్జునతో పాటుగా నాగ చైతన్య కూడా నటిస్తాడని తెలుస్తుంది. సినిమాలో చైతుకి జోడీగా కీర్తి సురేష్ ఇప్పటికే ఫైనల్ అవగా నాగార్జునకు జతగా పూజా హెగ్దెని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. వరుస స్టార్ అవకాశాలతో జబర్దస్త్ కెరియర్ సాగిస్తున్న పూజా హెగ్దె నాగార్జున సరసన కూడా నటిస్తుంది.

ప్రస్తుతం పూజా హెగ్దె అల్లు అర్జున్ త్రివిక్రం కాంబినేషన్ మూవీలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా వరుణ్ తేజ్ వాల్మీకిలో కూడా చేస్తుంది. మొత్తానికి ముకుంద, ఒక లైలా కోసం సినిమాలు నిరాశపరచినా డిజే నుండి పూజాకి లక్ కలిసి వస్తుందని చెప్పాలి. ఈమధ్య మహేష్ మహర్షి సినిమాలో నటించిన అమ్మడు ఆ సినిమా హిట్ తో మరింత జోష్ పెంచింది.