
అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. నెల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా ఇప్పటివరకు ఆ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది మాత్రం ఎనౌన్స్ చేయలేదు. కొత్త హీరోయిన్ ల కన్నా ఆల్రెడీ ఫాంలో ఉన్న భామ అయితే బెటర్ అని పూజా హెగ్దె, రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ పేర్లు వినపడ్డాయి.
ఫైనల్ గా అఖిల్ 4వ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న సెలెక్ట్ అయ్యిందట. వరుస విజయాలతో లక్కీ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న అఖిల్ సరసన ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్న రష్మిక చేతినిండా ఆఫర్లు ఉన్నాయి. నితిన్ భీష్మతో పాటుగా మహేష్ సరిలేరు నీకెవ్వరులో కూడా రష్మిక నటిస్తుంది. ఇప్పుడు అఖిల్ సినిమాలో కూడా ఆమె ఫైనల్ అయ్యిందట.
చూస్తుంటే తెలుగులో రష్మిక టాప్ హీరోయిన్ గా మారేలా ఉంది. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన దేవదాస్ సినిమా పెద్దగా ఆడకపోయినా రష్మికకు మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి. 2020 మాత్రం రష్మిక ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు.