సందీప్ కిషన్ ను దెయ్యం కాపాడుతుందా..!

యువ హీరోల్లో ఈమధ్య బాగా వెనుకపడ్డ హీరో సందీప్ కిషన్. లాస్ట్ ఇయర్ మనసుకి నచ్చింది, నెక్స్ట్ ఏంటి సినిమాలతో వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా కార్తిక్ రాజ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా నిను వీడని నీడను నేనే. జూలై 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను సందీప్ కిషన్ నిర్మించడం విశేషం. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందీప్ కిషన్ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు.

ఓ దర్శకుడు తను హీరోగా సినిమా చేసేందుకు నిర్మాత దగ్గరకు వెళ్తే ఇంకెక్క సందీప్ కిషన్ అతను అయిపోయాడుగా అన్నాడట. అదే తనలో కసి పెంచి ఈ సినిమా తీసేలా చేసిందని అన్నాడు సందీప్ కిషన్. సినిమా కచ్చితంగా తన కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ అవుతుందని చెప్పుకొచ్చాడు. సస్పెన్స్, హర్రర్ మిక్స్ చేసి తీసిన నిను వీడని నీడను నేనే సినిమా అయినా సందీప్ కిషన్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఈవెంట్ లో భాగంగా రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి.