బన్ని 'ఐకాన్' కొత్త కొత్తగా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుత్రం త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ రెండు బ్యానర్లు కలిపి ఈ సినిమా నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయిందని తెలుస్తుంది. దసరా బరిలో సినిమాను దించాలని అనుకున్నా 2020 పొంగల్ కు రిలీజ్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ తో ఒక సినిమా, వేణు శ్రీరాంతో మరో సినిమా లైన్ లో పెట్టాడు బన్ని.  

సుకుమార్ సినిమా కన్నా వేణు శ్రీరాం ఐకాన్ సినిమా ముందు సెట్స్ మీదకు వెళ్లేలా ఉంది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగా సినిమాలో బన్ని డ్యుయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. అల్లు అర్జున్ కెరియర్ లో ఇప్పటివరకు డ్యుయల్ రోల్ చేయలేదు ఇక ఈ సినిమాలో మరో ట్విస్ట్ ఏంటంటే సినిమాలో బన్ని యువ హీరో పాత్రతో పాటుగా మధ్యవయస్కుడి పాత్రలో కూడా కనిపిస్తాడట.

ఇన్నేళ్ల కెరియర్ లో అల్లు అర్జున్ మిడిల్ ఏజ్ రోల్ వేయలేదు. ఈ పాత్ర కోసం కెరియర్ లో ఫస్ట్ టైం విగ్ కూడా వాడుతాడని తెలుస్తుంది. సో అల్లు అర్జున్ ఐకాన్ సినిమా బన్నికి అంతా కొత్త కొత్త ప్రయోగాలు చేసేలా కనిపిస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉంది. అయితే వాళ్లెవరు అన్నది ఇంకా తెలియలేదు.