
యువ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా కెవి మహేంద్రా డైరక్షన్ లో వస్తున్న సినిమా దొరసాని. జీవిత రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. దొరసానిని ప్రేమించిన ఓ పేదవాడి ప్రేమ ఎన్ని మలుపులు తిరిగింది అన్నది సినిమా కథ. కథ కొత్తగా లేకున్నా కథనం ఫ్రెష్ గా అనిపిస్తుంది.
ఆనంద్ దేవరకొండ డైలాగ్స్ సేమ్ విజయ్ దేవరకొండని దించేశాడనేలా ఉండగా సినిమాకు దొరసాని హీరోయిన్ శివాత్మిక ప్లస్ అవుతుంది. ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ కూడా అలరించేలా ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పణలో మధురా శ్రీధర్, యశ్ రంగినేని నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 12న రిలీజ్ అవుతుంది. మరి ఆనంద్ దేవరకొండ దొరసాని ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.