అర్జున్ రెడ్డి డైరక్టర్ కు అదిరిపోయే ఛాన్స్..!

తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేశాడు సందీప్ వంగ. షాహిద్ కపూర్, కియరా అద్వాని జంటగా నటించిన ఈ సినిమా అక్కడ కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. వారం రోజుల కలక్షన్స్ 150 కోట్లు క్రాస్ అయ్యాయి. విమర్శలు ఎలా ఉన్నా కబీర్ సింగ్ కలక్షన్స్ మాత్రం అదరగొడుతున్నాయి. ఇక ఈ సినిమా డైరక్టర్ సందీప్ వంగ టాలెంట్ కు బాలీవుడ్ హీరోలు ఫిదా అయ్యారని తెలుస్తుంది.

అందుకే బాలీవుడ్ కండల వీరుడు యాక్షన్ హీరో సల్మాన్ ఖాన్ సందీప్ వంగకు ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. కబీర్ సింగ్ సినిమా చూసిన సల్మాన్ డైరక్టర్ టాలెంట్ కు ఇంప్రెస్ అయ్యాడట. తన కోసం ఓ కథ సిద్ధం చేయమని కలిసి చేద్దామని చెప్పాడట. సల్మాన్ తో సినిమా అంటే సందీప్ వంగ బాలీవుడ్ స్టార్ డైరక్టర్ లిస్ట్ లో చేరినట్టే. కబీర్ సింగ్ తర్వాత తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేయాల్సి ఉన్న సందీప్ సడెన్ గా బాలీవుడ్ ఛాన్స్ రాగానే అక్కడే స్థిర పడేలా ఉన్నాడు.