రణరంగం టీజర్.. మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి..!

యువ హీరో శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా రణరంగం. పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజైంది. సినిమా కథను తెలియచేస్తూ రిలీజైన టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ముఖ్యంగా డాన్ గా మారిన దేవా దేవుడిని నమ్మాలంటే భక్తి ఉండాలి.. మనిషిని నమ్మాలంటే ధైర్యం ఉండాలంటూ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

సినిమాలో శర్వానంద్ రెండు వేరియేషన్స్ లో కనిపిస్తున్నాడు. కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవనుంది. టీజర్ అంచనాలను పెంచగా రణరంగం సినిమా శర్వానంద్ కు సూపర్ హిట్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు.  

లాస్ట్ ఇయర్ పడి పడి లేచే మనసు సినిమా నిరాశపరచగా రణరంగం మాత్రం టార్గెట్ మిస్ అవదని అంటున్నారు. డైరక్టర్ సుధీర్ వర్మ కూడా హిట్ కోసం తపిస్తున్నాడు. మరి శర్వా, సుధీర్ ఇద్దరు కలిసి చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.