సందీప్ వెంటపడుతున్న విక్రమ్

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా హింది రీమేక్ కబీర్ సింగ్ కూడా వసూళ్ల బీభత్సం సృష్టిస్తున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా చేసిన ఆ సినిమాను సందీప్ వంగ డైరెక్ట్ చేశాడు. కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. ఇదే సినిమాను తమిళంలో చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ ఓసారి షూటింగ్ మొత్తం అయ్యాక మొత్తం చెత్తలో పడేసిన నిర్మాతలు మళ్లీ డైరక్టర్ ను మార్చి చేస్తున్నారు.

తెలుగు అర్జున్ రెడ్డి సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసిన గిరీశయ్య తమిళ అర్జున్ రెడ్డిని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆదిత్య వర్మ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ అలరించింది. అయితే హిందిలో కబీర్ సింగ్ రిజల్ట్ చూశాక విక్రం మళ్లీ సందీప్ ను ఆదిత్య వర్మలో ఇన్వాల్వ్ అవ్వాల్సిందని కోరాడట. తనయుడి డెబ్యూ మూవీ కాబట్టి విక్రం ఎలాగైనా ఈ సినిమాను హిట్ అయ్యేలా చేయాలని చూస్తున్నాడు. ఆదిత్య వర్మకు సందీప్ సపోర్ట్ ఉంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.