నెల ముందే అడ్వాన్స్ బుకింగ్స్..!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా భరత్ కమ్మ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. గీతా గోవిందంతో సూపర్ హిట్ పెయిర్ గా క్రేజ్ తెచ్చుకున్న విజయ్, రష్మికలు డియర్ కామ్రేడ్ లో కలిసి నటించడం ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచింది. ఈ సినిమా జూలై 26న రిలీజ్ ప్లాన్ చేశారు. అటు ఇటుగా రిలీజ్ కు నెల రోజులు ఉండగా అప్పుడే వాషింగ్ టన్ ఓ లొకేషన్ లో సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇస్తున్నారట. 

విజయ్ పెళ్లిచూపులు సినిమా యూఎస్ లో 50 రోజులు సక్సెస్ ఫుల్ గా ఆడింది. గీతా గోవింద, టాక్సీవాలా కూడా అక్కడ మంచి ఫలితాలు తెచ్చుకున్నాయి. ప్రస్తుతం ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ మార్కెట్ బాగుంది. స్టార్ సినిమాలకు ధీటుగా అతని సినిమాల మార్కెట్ ఉంది. ఇక నెల ముందే అడ్వాన్స్ టికెట్స్ పెట్టారంటే విజయ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంది అన్నది అర్ధం చేసుకోవచ్చు. 

ఈ సినిమాతో పాటుగా విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ డైరక్షన్ లో బ్రేకప్ సినిమా చేస్తున్నడు. ఆ సినిమాతో పాటుగా ఆనంద్ అన్నామలై డైరక్షన్ లో హీరో సినిమా చేస్తున్నాడు.