బుర్రకథ వాయిదా

ఈరోజు (శుక్రవారం) రిలీజ్ అవుతుందని అనుకున్న ఆది సాయి కుమార్ బుర్ర కథ సినిమా వాయిదా పడింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోని ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నామని చిత్రయూనిట్ ప్రకటించారు. ఈరోజు రాజశేఖర్ కల్కి, శ్రీవిష్ణు బ్రోచేవారెవరురా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే వీటితో పాటుగానే ఆది సాయి కుమార్ బుర్రకథ రేసులో ఉండాల్సింది. కాని సెన్సార్ వాళ్లు ఈ సినిమా సెన్సార్ చేయడానికి కుదరకపోవడంతో సినిమా వాయిదా పడ్డది.   

గురువారం సాయంత్రం వరకు చిత్రయూనిట్ ప్రయత్నించినా కూడా సెన్సార్ అధికారి బుర్ర కథ సెన్సార్ చేయకపోవడంతో సినిమా వాయిదా వేయక తప్పలేదు. అసలే కెరియర్ అటు ఇటుగా ఉన్న ఆది సాయి కుమార్ కు బుర్ర కథ వాయిదా మరింత రిస్క్ లో పడేసింది. సినిమా టీజర్, ట్రైలర్ అలరించగా సినిమా తప్పకుండా ఆడియెన్స్ ను మెప్పిస్తుందని అనిపిస్తుంది. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది ఇంకా వెళ్లడించలేదు. డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మిస్తీ చక్రవర్తి, నైనా షా హీరోయిన్స్ గా నటించారు.