
ఎనర్జిటిక్ స్టార్ రామ్, పూరి జగన్నాథ్ డైరక్షన్ లో చేస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. పూరి కనెక్ట్ నిర్మాణంలో పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చార్మినార్ ప్రాంతంలో జరుగుతుంది. అయితే షూటింగ్ గ్యాప్ లో రాం అలా ఓ సిగరెట్ వెలిగించాడు. పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ నిషేధమని పోలీస్ వారు 200 ఫైన్ వేశారు.
అయితే ఈ విషయంపై రాం సైలెంట్ గా ఉన్నాడు. ఈ విషయంపై ట్రోల్ ఎక్కువవడం వల్ల రామ్ స్పందించాల్సి వచ్చింది. గురుడు షాట్ గ్యాప్ లో సిగరెట్ వెలిగించి ఉంటాడని కామెంట్స్ వచ్చాయి. నా టైం, పబ్లిక్ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక రెస్పాండ్ గాలే.. షాట్ ల కాల్చిన తమ్మి.. బ్రేక్ ల కాద్.. టైటిల్ సాంగ్ ల చూస్తవ్ గా స్టెప్పు.. ఫిర్ బ్జీ లా కి ఇజ్జత్ ఇచ్చి ఫైన్ కట్టినం గిప్పుడు నువ్వు కూడా నా లెక్క లైట్ తీస్కో పని చూస్కో అని ట్వీట్ చేశాడు.
Naa time-u.. Public time-u waste cheyadam ishtam leka respond gaale...
— RAm POthineni (@ramsayz) June 25, 2019
“Shot la kalchina thammi..Break la kaad..Title song la chustaavga stepu😏..phir bhi law ki izzat ichi fine kattinam..🚭
Gippudu nuvvu kuda naa lekka..#LiteTheskoPaniChusko 😘”
-Ustaad #iSmartShankar