
సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా మహర్షి. మే 9న రిలీజైన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా 50 రోజులను పూర్తి చేసుకుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా 200 సెంటర్స్ లో అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా మహేష్ కెరియర్ లో హయ్యెస్ట్ కలక్షన్స్ వసూళు చేసింది. నైజాంలో నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది మహర్షి.
ఇక ఈ సినిమా 50 డేస్ ఫంక్షన్ ఈ నెల 28న శిల్పకళావేదికలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు స్పెష గెస్ట్ గా నాచురల్ స్టార్ నాని వస్తున్నాడని తెలుస్తుంది. సూపర్ స్టార్ కు నాని గెస్ట్ ఏంటి ఆశ్చర్యపోవచ్చు. నాని కూడా నాచురల్ స్టార్ గా స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు. మహేష్, నానిల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి అందుకే నాని గెస్ట్ గా వస్తున్నాడు. మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెంకటేష్, విజయ్ దేవరకొండ అటెండ్ అయ్యారని తెలిసిందే.