మాయ చేస్తున్న సమంత

స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత మరింత రెచ్చిపోతుందని తెలిసిందే. ఓ పక్క వరుస సినిమాలు చేస్తుండగా అవి కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా ఫ్యాన్స్ ను అలరిస్తుంది సమంత. అక్కినేని కోడలిగా ఓ పక్క సినిమాల్లో హద్దు దాటని సామ్ ఫోటో షూట్స్ లో మాత్రం గ్లామర్ షో చేస్తుంది. అందుకు చైతు పర్మిషన్ ఉందని మొన్నామధ్య ఇంటర్వ్యూలో చెప్పింది కూడా.

లేటెస్ట్ గా తన హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది సమంత. ఏమాయ చేసావే సినిమా నుండి మాయ చేస్తూ వస్తున్న సమంత ఇప్పటికి అదే ఛార్మింగ్ తో దూసుకెళ్తుంది. కేవలం అందం మాత్రమే కాదు అభినయంలో కూడా తనకు తానే సాటి అనేలా చేస్తుంది. జూలై 5న రిలీజ్ కాబోతున్న ఓ బేబీ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సమంత ఆ సినిమాతో కూడా హిట్టు అందుకునేలా ఉంది.