
మజిలీ సూపర్ హిట్ తో మంచి ఫాంలో ఉన్న నాగ చైతన్య ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో వెంకీమామ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమా చేస్తున్నాడు. నాగార్జున చేస్తున్న మన్మధుడు 2 సినిమా పూర్తి కాగానే బంగార్రాజు మొదలు పెడతారని తెలుస్తుంది. సోగ్గాడే చిన్ని నాయనా సీక్వల్ గా వస్తున్న బంగార్రాజు సినిమాను కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.
సినిమాలో నాగ చైతన్య సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్య సరసన కీర్తి సురేష్ ను సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. మహానటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కీర్తి సురేష్ తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటుంది. తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న కీర్తి సురేష్ నాగ చైతన్యతో జతకట్టబోతుంది. మహానటి సినిమాలో నాగ చైతన్య ఏయన్నార్ గా నటించగా కీర్తి సురేష్ సావిత్రిగా అదరగొట్టేసింది. సినిమాలో వీరిద్దరి సీన్స్ ఆకట్టుకున్నాయి. మరి హీరో హీరోయిన్ గా ఈ బంగర్రాజులో చైతు, కీర్తిలు ఎలా అలరిస్తారో చూడాలి.