ఆమె ఆ సీన్స్ కు కత్తెర తప్పదా..!

సౌత్ లో క్రేజీ బ్యూటీగా ఇమేజ్ తెచ్చుకున్న అమలా పాల్ పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. కన్నడ, తమిళ పరిశ్రమలో వరుస అవకాశాలు అందుకుంటున్న అమలా పాల్ లేటెస్ట్ గా రత్న కుమార్ డైరక్షన్ లో ఆడై సినిమా చేస్తుంది. ఈ సినిమాను తెలుగులో ఆమె టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ లో అమలా పాల్ న్యూడ్ సీన్స్ షాక్ ఇచ్చాయి. సినిమాలో ఆ సీన్స్ కు సెన్సార్ కత్తెర తప్పదని కొందరు అంటున్నారు. 

ఇన్నాళ్లు అసలు గ్లామర్ షో చేయని అమలా పాల్ ఒకేసారి న్యూడ్ గా నటించడం పట్ల అందరు సర్ ప్రైజ్ అయ్యారు. ముఖ్యంగా టీజర్ లో ఆమె ఎక్స్ ప్రెషన్ షాక్ ఇచ్చింది. ఇంత సాహసం చేసిన అమలా పాల్ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా సినిమా రిలీజ్ టైంలో సెన్సార్ తిప్పలు తప్పవని అంటున్నారు. అమలా పాల్ న్యూడ్ సీన్స్ అన్ని సెన్సార్ స్కూటినిలో కట్ చేస్తారని అంటున్నారు. మరి సినిమాకు అవసరమైన ఈ సీన్స్ కట్ చేస్తే ఆ ప్రభావం రిజల్ట్ మీద పడుతుందేమో చూడాలి.