
బాలీవుడ్ నుండి బిగ్ బాస్ రియాలిటీ షోని అన్ని సౌత్ రీజినల్ లాంగ్వేజెస్ లో ప్రారంభించారు. తెలుగులో ఆల్రెడీ రెండు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 3కి రెడీ అవుతుంది. ఇక తమిళంలో కూడా బిగ్ బాస్ 2 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. అక్కడ కమల్ హాసన్ రెండు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించారు. బిగ్ బాస్ సీజన్ 3 తమిళంలో మళ్లీ కమల్ హాసనే హోస్ట్ గా చేస్తారని తెలుస్తుంది.
ఈ నెల 23న మొదలవబోతున్న బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3పై మద్రాస్ హై కోర్ట్ లో లాయర్ సుదన్ పిటీషన్ వేశాడు. విజయ్ ఛానెల్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ లో పాల్గొంటున్న సభ్యులు డ్రెస్సులు, డబుల్ మీనింగ్ డైలాగులు తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగిస్తుందని.. ఈ షో ముందు సెన్సార్ బోర్డుతో ఫుల్ ఎపిసోడ్ చూపించి ఆ తర్వాత టెలికాస్ట్ చేయాలని పిటీషన్ లో రాసుకొచ్చారు. అయితే సదన్ పిటీషన్ పై హై కోర్ట్ ఎలా తీర్పు ఇస్తుందో చూడాలి.