
టైటిల్ చూసి బిగ్ బాస్ సీజన్ 3 లో మహానటి సావిత్రి పాత్రధారి మళయాళ భామ కీర్తి సురేష్ కంటెస్టంట్ గా వస్తుందని భావిస్తే పప్పులో కాలేసినట్టే. అయినా అమ్మడికి వరుస సినిమా అవకాశాలు వస్తుంటే బిగ్ బాస్ లో కంటెస్టంట్ గా రావాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న కీర్తి సురేష్ బిగ్ బాస్ లో రావడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 3కి రంగం సిద్ధమవుతుంది.
బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా కింగ్ నాగార్జున చేయనున్నాడు. అయితే బిగ్ బాస్ 3 కంటెస్టంట్ గా వి6 సావిత్రి సెలెక్ట్ అయ్యిందట. వి6 ఛానెల్ లో బిత్తిరి సత్తితో పాటుగా సావిత్రి కూడా ఫేమస్ అయ్యింది. తెలంగాణా యాసలో సావిత్రి చేసే హంగామా అంతా ఇంతా కాదు ఇదే షోకి ప్లస్ అవుతుందని ఆమెను బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో తీసుకున్నారని తెలుస్తుంది. ఇక ఇప్పటికే శ్రీముఖి కూడా బిగ్ బాస్ 3కి ఎంపికైనట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈసారి క్రేజీ కంటెస్టంట్స్ తో షో కలర్ ఫుల్ గా సాగుతుందని అంటున్నారు.