మహేష్.. రష్మిక.. ఓ క్రేజీ లవ్ స్టోరీ..!

సూపర్ స్టార్ మహేష్ 26వ సినిమాగా వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. దిల్ రాజు, అనీల్ రావిపుడి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస సక్సెస్ లను అందుకున్న అనీల్ రావిపుడి మహేష్ కోసం అదిరిపోయే కథ సిద్ధం చేశాడట.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్, రష్మికల మధ్య లవ్ ట్రాక్ అదిరిపోద్దట. ఆ లవ్ స్టోరీ మొత్తం ట్రైన్ లోనే ఉంటుందని తెలుస్తుంది. ఛలో, గీతా గోవిందం సినిమాలతో యూత్ తో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న రష్మిక మొదటిసారి స్టార్ హీరో ఛాన్స్ పట్టేసింది. ఈ సినిమా హిట్టైతే రష్మిక కూడ వరుస స్టార్ ఛాన్సులు వచ్చినట్టే.