
సౌత్ క్రేజీ హీరోయిన్ తమన్నా తాను పెళ్లికి సిద్ధమే అంటుంది. మంచు మనోజ్ శ్రీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన తమన్నా ఆ తర్వాత మళ్లీ హ్యాపీడేస్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే సెకండ్ ఎంట్రీ ఆమెకు బాగా కలిసి వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు అందరి స్టార్స్ తో నటించిన తమన్నా లేటెస్ట్ గా అభినేత్రి 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభినేత్రి సినిమాకు సీక్వల్ గా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదని చెప్పొచ్చు.
ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా పెళ్లెప్పుడు అని అడుగ్గా.. నేను పెళ్లికి రెడీ వరుడిని వెతికి పెట్టండి అంటూ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చేసింది తమన్నా. తనకు వరుణ్ణి వెతికిపెట్టమని తన దర్శకుడు విజయ్ కు కూడా చెప్పిందట తమన్నా. ఎప్పుడు పెళ్లని అడిగినా ఇప్పుడే పెళ్లేంటి అంటుంటారు కాని ఇప్పుడు వెరైటీగా వెతికి పెట్టండి పెళ్లి చేసుకుంటా అని అంటున్నారు. మొత్తానికైతే తమన్నా కూడా పెళ్లికి రెడీ అయ్యిందని తెలుస్తుంది. మరి మిల్కీ బ్యూటీ మనసు గెలిచుకునే ఆ లక్కీ గాయ్ ఎవరో చూడాలి.