
మళయాళ భామ కీర్తి సురేష్ మహాంటి సినిమాతో తెలుగు ప్రేక్షక హృదయాలను గెలుచుకుంది. నేను శైలజతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ సౌత్ లో బిజీ హీరోయిన్ అయ్యింది. ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలతో క్రేజ్ సంపాదించిన కీర్తి సురేష్ తెలుగులో కూడ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. ఆ సినిమాతో పాటుగా యువ హీరో నితిన్ సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది.
శ్రీనివాస కళ్యాణం ఇచ్చిన షాక్ కు కొంత గ్యాప్ తీసుకున్న నితిన్ వెంకీ కుడుముల డైరక్షన్ లో భీష్మ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో కూడా ఓ సినిమా ఓకే చేశాడట. తొలిప్రేమతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి మిస్టర్ మజ్ ను నిరాశ పరచాడు. అయితే నితిన్ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారట. మొత్తానికి తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో కీర్తి మంచి ఫాంలో ఉందని చెప్పొచ్చు.