బెల్లంకొండ శ్రీనివాస్ 'రాక్షసుడు' టీజర్

డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శీను నుండి లాస్ట్ వీక్ వచ్చిన సీత వరకు సినిమాలైతే చేస్తున్నాడు కాని వాటికి తగినట్టు ఫలితాలను మాత్రం అందుకోవట్లేదు. ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్టు సినిమా లేని బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయత్నాలను మాత్రం ఆపట్లేదు. సీత డిజాస్టర్ కాగా తన తర్వాత సినిమా రాక్షసుడు సినిమా టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్.

కోలీవుడ్ లో సూపర్ హిట్టైన రాక్షసన్ సినిమా రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ తో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా నుండి ఈరోజు రిలీజైన టీజర్ ఆకట్టుకుంది. సైకో కిల్లర్ ను పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఎలా పట్టుకున్నాడు అన్నది సినిమా కథ. టీజర్ లో స్టోరీ తెలుస్తుండగా ఈ సినిమాతో అయినా బెల్లంకొండ శ్రీనివాస్ కు హిట్టు వస్తుందేమో చూడాలి. జూలై 18న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు.