
సూపర్ స్టార్ మహేష్ మహర్షి సక్సెస్ జోష్ లో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ 26వ సినిమా షురూ అయ్యింది. సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సరిలేరు నీకెవ్వరు అంటూ సర్ ప్రైజ్ ఇచ్చాడు మహేష్. అనీల్ రావిపుడి డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ముహుర్తం పెట్టేశారు. జూన్ సెకండ్ వీక్ లో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలు కానుందని తెలుస్తుంది. టైటిల్ పోస్టర్ చూస్తే సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. పటాస్, ఎఫ్-2 వరకు వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి సూపర్ స్టార్ తో పవర్ ఫుల్ స్టోరీతో పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్నాడు. 2020 సంక్రాంతి టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ కు డబుల్ ఫెస్టివల్ చేసుకునేలా ఉంటుందేమో చూడాలి.