
యువ హీరో రాజ్ తరుణ్ కూడా పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమయ్యాడు. కొన్నాళ్లుగా తన పెళ్లి పై వస్తున్న వార్తలకు ఫైనల్ గా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రాజ్ తరుణ్. కుమారి హెబ్భా పటేల్, అను ఇమ్మాన్యుయెల్ లతో ఎఫైర్ నడిపాడన్న రూమర్స్ వచ్చినా అవి జస్ట్ రూమర్స్ లానే మిగిపోయాయి. కెరియర్ లో కూడా కొద్దిగా వెనుకపడ్డ రాజ్ తరుణ్ పెళ్లికి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని రాజ్ తరుణ్ స్వయంగ ప్రకటించడం జరిగింది.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే రాజ్ తరుణ్ ది ప్రేమ పెళ్లి అని తెలుస్తుంది. తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడట. అందుకే తనది లవ్ కం ఎరేంజ్డ్ మ్యారేజ్ అంటున్నాడు రాజ్ తరుణ్. అయితే తను పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరన్నది మాత్రం చెప్పలేదు. అది డైర్కెట్ గా ఎనౌన్స్ చేస్తానని అంటున్నాడు. మరి రాజ్ తరుణ్ మనసు దోచిన ఆ లాక్కీ గాళ్ ఎవరో తెలియాల్సి ఉంది. మనోడి స్పీడ్ చూస్తుంటే ఈ ఇయర్ లోనే పెళ్లి చేసుకునేలా ఉన్నాడు.