
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఫెయిల్ అయ్యాడు. అఫ్కోర్స్ ఈసారి పవన్ కన్నా ఏపి ప్రజలు జగన్ వైపు మొగ్గుచూపారని చెప్పొచ్చు. కనీసం తాను గెలిచినా కాస్త మర్యాదగా ఉండేది పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా పవన్ ఓడటం పవన్ ను మరింత దిగులు పడేలా చేసింది. చివరి వరకు పాలిటిక్స్ లోనే అని చెప్పిన పవన్ సినిమాల మీద కూడా దృష్టి పెడతారని తెలుస్తుంది.
ఇదిలాఉంటే బండ్ల గణేష్ నిర్మాణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 100 కోట్ల సినిమా అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈమధ్య నిర్మాణానికి దూరంగా ఉన్న గణేష్ పవన్ తో సినిమా అంటే రూమర్ అని కొట్టిపారేయలేం. బోయపాటి శ్రీనుతో పవన్ సినిమా అంటేనే తేడా కొడుతుంది. పవన్ రెమ్యునరేషన్ 40 కోట్లు.. బోయపాటికి 10 కోట్లు.. మేకింగ్ కు 50 ఇలా బడ్జెట్ కూడా 100 కోట్లని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది బండ్ల గణేష్ నోరు విప్పితేనే తెలుస్తుంది.