
ఎన్.టి.ఆర్ జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు. తన యాభై ఏళ్ల సినిమా జీవితంలో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిదని.. అది గత జన్మల సుకృతంగా భావిస్తానని అన్నారు రాఘవేంద్ర రావు. ఇక మహానుభావుడి జయంతి సందర్భంగా తన తదుపరి సినిమా ప్రకటించారు దర్శకేంద్రుడు.
తన సోషల్ బ్లాగ్ లో ముగ్గురు డైరక్టర్స్.. ముగ్గురు హీరోయిన్స్.. హీరో..? అంటూ ఓ సినిమా ఎనౌన్స్ చేశారు రాఘవేంద్ర రావు. తన సుధీర్ఘ అనుభవంతో రాసుకున్న ఈ కొత్త ప్రయత్నం చేస్తున్నట్టు వెళ్లడించారు. 2017లో ఓం నమో వెంకటేశాయ సినిమా చేసిన రాఘవేంద్ర రావు ఆ సినిమాతోనే రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. రాఘవేంద్ర రావు నుండి సినిమా ఎనౌన్స్ మెంట్ రావడం ఆయన ఫ్యాన్స్ కు సంతోషాన్ని ఇచ్చింది.