
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి కావొచ్చిందని తెలుస్తుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో చిరంజీవి సినిమా ఉంటుందని అంటున్నారు.
కొరటాల శివ సినిమా ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. త్వరలోనే ఆ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లబోతుందట. ఇక ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉండగా అందులో అనుష్కకు ఒక ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈమధ్యనే జెర్సీ సినిమాతో సత్తా చాటిన శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుందట. సినిమాలో ఆమె నటన చూసి ఇంప్రెస్ అయిన చిరు ఆమెకు ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అదే నిజమైతే ఈ కన్నడ భామకు ఇక తిరుగు లేదని చెప్పొచ్చు. ఎంతోమంది హీరోయిన్స్ చిరు అవకాశం కోసం చూస్తుంటే రెండో సినిమానే ఆమెకు ఆ లక్కీ ఛాన్స్ రావడం అదృష్టమని చెప్పొచ్చు.