
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా నుండి రీసెంట్ గా ఓ పోస్టర్ రిలీజ్ అవగా లేటెస్ట్ గా మరో పోస్టర్ సర్ ప్రైజ్ గా రిలీజ్ చేశారు. ఈసారి బైక్ పై రైడ్ చేస్తున్న ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. స్టైలిష్ గాగుల్స్, అదిరిపోయే కాస్టూం, చెవిలో బ్లూటూత్ ఇలా స్టైల్ష్ బైక్ రైడ్ చేస్తున్న పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో బైక్ రైడింగ్ కు ప్రాధాన్యత ఇచ్చారు అంటే సినిమాలో అది ఎంత ఇంపార్టెంట్ అన్నది అర్ధం చేసుకోవచ్చు.
కొత్తగా రిలీజైన ఈ క్రేజీ పోస్టర్ కూడా సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఎలా ఉంటుంది అన్న ఎక్సైట్ మెంట్ రోజు రోజుకి పెరుగుతుంది. ఇక ఈ పోస్టర్ లో కూడా మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆగష్టు 15న సాహో రిలీజ్ ఫిక్స్ అవ్వొచ్చు. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సాహో సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు.