
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రైటర్ గా ఉన్న వక్కంతం వంశీ డైరక్టర్ గా మొదటి ప్రయత్నం చేశాడు. ఆ సినిమా అనుకున్నంత ఫలితాన్ని అందించలేదు. వక్కంతం వంశీ రెండో అవకాశం కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే నా పేరు సూర్య హీరో అల్లు అర్జున్ తన తండ్రి బ్యానర్ అయిన గీత ఆర్ట్స్ లో వంశీకి అవకాశం ఇస్తున్నారట. గీతా ఆర్ట్స్ లో వక్కంతం వంశీ మూవీ ఉంటుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో హీరోగా నాని నటిస్తాడట. గీతా ఆర్ట్స్ లో సినిమా అంటే కచ్చితంగా సేఫ్ ప్రాజెక్ట్ అన్నట్టే నాని సబ్జెక్ట్ ఓకే చేశాడు అంటే ఇక తిరిగు లేదు. మరి నాని తో వక్కంతం వంశీ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. రైటర్ గా సూపర్ సక్సెస్ లు అందుకున్న వక్కంతం వంశీ డైరక్టర్ గా సెకండ్ ప్రయత్నం అయినా సక్సెస్ కొడతాడేమో చూడాలి. వంశీ మాత్రం తన పెన్నుకి మరింత పదును పెట్టి ఈ సినిమా కథ రాస్తున్నాడని తెలుస్తుంది.