
జబర్దస్త్ సుడిగాలి సుధీర్ కు ఇన్నాళ్లకు హీరోగా ప్రమోషన్ వచ్చింది. జబర్దస్త్, ఢీ షోలతో తన కామెడీతో అలరించిన సుధీర్ కామెడీలో భాగంగా తనని తాను హీరో.. హీరో.. అని పలు సందర్భాల్లో అంటున్నా.. తనకి హీరో అవకాశాలు ఎవరిస్తారు అనుకున్నారు. ఈమధ్య సినిమాల్లో అడపాదడపా కనిపిస్తున్న సుధీర్ ఫైనల్ గా హీరో ఛాన్స్ పట్టేశాడు. పులిచర్ల రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సాఫ్ట్ వేర్ సుధీర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పోసాని, ఇంద్రజ, షయాజి షిండే వంటి వారు నటిస్తున్నారు. సినిమాలో తాను హీరో అని చెప్పడం కన్నా కథే హీరో అంటున్నాడు సుధీర్. జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ తో ఈటివిలో పలు రియాలిటీ షోలు చేస్తున్న సుధీర్ హీరోగా నిలదొక్కుకుంటాడా లేదా అన్నది చూడాలి. యూట్యూబ్ జోడీగా సుధీర్, రష్మిలకు మంచి ఫాలోయింగ్ ఉంది. మరి సుధీర్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో రష్మితో ఓ స్పెషల్ సాంగ్ అయినా చేస్తే బాగుంటుందని ఆడియెన్స్ ఫీలింగ్.