మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018 : ఫోర్త్ ర్యాంక్ లో విజయ్ దేవరకొండ..!

టాలీవుడ్ సినిమాలే కాదు హీరోలు కూడా బాలీవుడ్ సినిమాలకు గట్టి పోటీ ఇస్తున్నారు. సినిమాలతో పోటీ అటుంచితే మన హీరోల క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్ కు పాకేసింది. ఒకప్పుడు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో టాప్ 50లో తెలుగు వాళ్లున్నా సంతోషించే వారు కాని ఇప్పుడు ఏకంగా టాప్ 5లో స్థానం సంపాదించేస్తున్నారు. టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ 2018 టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో టాప్ 4గా నిలిచాడు.

విక్కి కౌశల్ మొదటి స్థానంలో ఉండగా.. ఫుట్ బాల్ ఆటగాడు ప్రతమేష్ మౌలింగ్కర్ రెండో ర్యాంక్ లో నిలిచాడు. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ 3వ ర్యాంక్ సాధించగా ఫోర్ట్ ర్యాంక్ లో విజయ్ దేవరకొండ ఉన్నాడు. బాలీవుడ్ క్రేజీ హీరోలైన సల్మాన్, హృతిక్ లతో పాటుగా ప్రభాస్, మహేష్ లాంటి తెలుగు స్టార్స్ ను కూడా దాటి విజయ్ ముందు వరుసలో ఉండటం విశేషం. మొత్తానికి రౌడీ హీరో తెలుగు సినిమాలతోనే ఈ రేంజ్ సత్తా చాటుతుంటే ఒకవేళ మనోడు బాలీవుడ్ కు వెళ్తే ఇక ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు.