
నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ. క్రికెటర్ అవ్వాలనుకున్న ఓ వ్యక్తి 36 ఏళ్ల వయసులో పడిన కష్టం అతని జీవిత కథను ప్రేక్షకుల మెప్పు పొందేలా చేశాడు దర్శకుడు గౌతం తిన్ననూరి. మొదటి షో నుండి మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఫైనల్ గా నాని కెరియర్ లో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన జెర్సీ ఫైనల్ రన్ లో 34 కోట్ల దాకా రాబట్టింది.
జెర్సీ సినిమాకు మంచి టాక్ వచ్చినా వసూళ్లు పెద్దగా రాలేదని అన్నారు. కాని క్లోజింగ్ కలక్షన్స్ చూసి అందరు షాక్ అవుతున్నారు. టాక్ బాగున్నా వసూళ్లు పెద్దగా రావని అనుకున్న వారికి షాక్ ఇస్తూ 34 కోట్లను రాబట్టడం విశేషం. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా సినిమాలో నాని తన నటనతో అందరిని సర్ ప్రైజ్ చేశాడు.