
విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ యూత్ ఆడియెన్స్ ను అలరించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా మే 9న రిలీజ్ ప్లాన్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా డియర్ కామ్రేడ్ రిలీజ్ చేస్తున్నారు.
అయితే విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ అనుకున్న మే 9న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ఎన్.జి.కే మూవీ రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. విజయ్ వర్సెస్ సూర్య బిగ్ క్లాష్ సినిమాల ఫలితంపై పడుతుంది. అందుకే విజయ్ వెనక్కి తగ్గి జూన్ 6న సినిమా రిలీజ్ చేసేలా చూస్తున్నారట. సూర్య ఎన్.జి.కే భారీ అంచనాలతో వస్తుంది. మరి విజయ్ అనుకున్న డేట్ కు వస్తాడా లేక వాయిదా వేస్తాడా అన్నది చూడాలి.