రాధా రవి వ్యాఖ్యలపై నయనతార స్పందన ఇదే..!

రీసెంట్ గా ఓ సినిమా ఆడియో వేడుకలో తమిళ నటుడు రాధా రవి హీరోయిన్ నయనతార పై చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. చూపులతో వల్లో వేసుకునే వారికి దేవత పాత్రలు ఇస్తున్నారని.. ఒకేసారి దెయ్యంగా.. సీతగా నయనతార చేస్తుందని.. అప్పట్లో కె.ఆర్ విజయ అలా చేసేవారని అవహేళన చేశాడు. రాధా రవి వ్యాఖ్యలకు వెంటనే వరలక్ష్మి శరత్ కుమార్, దర్శకుడు విఘ్నేష్ శివన్ మండిపడ్డారు.     

నడిగర్ సంఘం కూడా రాధా రవి వ్యాఖ్యలు ఖండిస్తూ ప్రకటన రిలీజ్ చేసింది. రాధా రవి వ్యాఖ్యలపై నయనతార కూడా త్వరగానే స్పందించింది. రెండు పేజీల మ్యాటర్ తో ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది నయనతార. సాధారణంగా పబ్లిక్ స్టేట్ మెంట్స్ ఇవ్వను.. నేను కాదు నా వృత్తి మాట్లాడాలి అన్నది నా స్వభావం. అనివార్య కారణాల వల్ల ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తుందని అన్నారు నయనతార.  


పురుషాధిపత్యం రాజ్యమేలుతున్న దుర్భర స్థితిలో తాను వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని.. రాధారవి వ్యాఖ్యలకు వెంటనే స్పందించి పార్టీ నుండి సస్పెండ్ చేసిన డి.ఎం.కే ప్రెస్టిడెంట్ స్టాలిన్ కు కృతజ్ఞతలు తెలిపారు నయనతార.. 

తమ జన్మ కూడా తల్లి అనే ఆడది నుండే జరిగిందని రాధా రవి లాంటి వారు గుర్తుపెట్టుకోవాలి.. ఇలాంటి మగాళ్ల మధ్య మనుగడ సాగిస్తున్న మహిళల పట్ల తనకు సానుభూతి కలుగుతుందని అన్నారు. భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాల్సిన రాధారవి లాంటి వారు ఇలా దిగజారిపోవడం విషాదకరం. ఇలాంటి చీప్ పబ్లిసిటీ కోసం ప్రాకులాడే వారితో సమాజానికి చాలా ప్రమాదం ఉంటుంది.  


దేవుడు నాకు తమిళ ఆడియెన్స్ రూపంలో గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. మంచి అవకాశాలు వచ్చేలా దీవించాడు.. ఇలాంటి నెగటివ్ కామెంట్స్ వచ్చినా సరే నేను సీతగా. దెయ్యంగా.. దేవగతా.. స్నేహితురాలిగా.. భార్యగా.. ప్రేయసిగా.. నటిస్తూనే ఉంటానని అన్నారు. నా అభిమానులకు వినోదాన్ని అందించడంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటానని అన్నారు నయనతార.    

ఫైనల్ గా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నడిగర్ సంఘం ను తాను ఒకటి అడుగుతున్నా.. ఇప్పటికైనా అంతర్గత ఫిర్యాదు విచారణ కమిటీని తయారుచేయాలని.. సుప్రీం కోర్ట్ ఆదేశాలను గౌరవిస్తూ విశాఖ గైడ్ లైన్స్ ద్వారా చర్యలు చేపట్టేలా ఇలాంటి సంఘటనలు విచారణ చేస్తారా అంటూ ప్రశ్నించింది. ఈ సమయంలో తనకు అండగా నిలిచి ఈ సమయంలో మద్ధుతు తెలిపిన మంచి మనసున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.. మీ నయనతర అంటూ తన ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది నయనతార.