
కన్నడ భామ రష్మిక మందన్న కిర్రాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్డం సంపాదించగా తెలుగులో ఛలో, గీతా గోవిందం హిట్స్ అందుకుని సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఈమధ్య నాగార్జున, నానిలు కలిసి చేసిన దేవదాస్ సినిమాలో కూడా రష్మిక నటించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతోనే డియర్ కామ్రెడ్ సినిమాలో నటిస్తున్న రష్మిక తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ సరసన నటిస్తుందని వార్తలు వచ్చాయి.
విజయ్, అట్లీ హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తుదని వార్తలు వచ్చాయి. రష్మిక కోలీవుడ్ ఎంట్రీపై తమిళ తంబీలు ఉత్సాహ పడ్డారు. విజయ్ సరసన రష్మిక పర్ఫెక్ట్ ఎంట్రీ అనుకున్నారు కాని రష్మిక ఆ సినిమాలో నటించడం లేదని తెలుస్తుంది. స్వయంగా రష్మిక ఈ విషయాన్ని వెళ్లడించడం జరిగింది. విజయ్ సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి కాని ఆ చిత్రయూనిట్ తనని సంప్రదించలేదు. ఆ అవకాశం వస్తే తప్పక చేస్తా.. కాని తమిళ ప్రేక్షకులు తన మీద చూపిస్తున్న ప్రేమకు సంతోషం.. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటూ ట్వీట్ చేసింది రష్మిక.
టాలీవుడ్ లో అడుగుపెట్టిన వేళా విశేషం ఏంటో కాని రష్మికకు ఇక్కడ సూపర్ క్రేజ్ వచ్చింది. అమ్మడి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవగా కచ్చితంగా తమిళంలో చేస్తే అక్కడ కూడా రష్మికకు మంచి పాపులారిటీ వస్తుందని చెప్పొచ్చు.