స్టార్ డైరక్టర్ బోయపాటి శ్రీను కేథరిన్ త్రెసాను వదలడం లేదా.. ఆ హీరోయిన్ మాయలో దర్శకుడు పడ్డాడా అంటే.. అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అసలు ఇంతకీ ఈ డౌట్ ఎందుకు వచ్చింది అంటే బోయపాటి శ్రీను డైరక్షన్ లో వచ్చిన సరైనోడు సినిమాలో నటించిన కేథరిన్ త్రెసాను బోయపాటి శ్రీను తన ప్రతి సినిమాలో పెట్టుకుంటున్నాడు. సరైనోడు తర్వాత చేసిన జయ జానకి నాయకాలో ఓ స్పెషల్ సాంగ్ లో కేథరిన్ కనిపించింది.
ఇక ఇప్పుడు రాం చరణ్ తో చేస్తున్న వినయ విధేయ రామా సినిమాలో కూడా కేథరిన్ తో ఓ స్పెషల్ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఇద్దరమ్మాయిలతో హీరోయిన్ గా లైం లైట్ లోకి వచ్చిన కేథరిన్ తెలుగు, తమిళ భాషల్లో సినిమలైతే చేస్తుంది కాని అందుకు తగినట్టుగా క్రేజ్ తెచ్చుకోవడంలో విఫలమైంది.
మరి చరణ్ తో ఐటం సాంగ్ అయినా సరే కేథరిన్ కు క్రేజ్ తెస్తుందేమో చూడాలి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న వినయ విధేయ రామ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.