కొరటాల శివ, త్రివిక్రం ఇద్దరిలో ముందు ఎవరు..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సైరా సినిమా తర్వాత కొరటాల శివతో సినిమా చేస్తాడని అంటున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా మొదలవనుందని తెలుస్తుంది. అయితే కొరటాల శివ అండ్ టీం ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇదిలాఉంటే ఈ సినిమా ఉంటుందో లేదో తెలియదు కాని మెగాస్టార్ చిరంజీవి మాటల మాంత్రికుడు త్రివిక్రం తో సినిమా మాత్రం ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.

చిరంజీవి నటించిన జై చిరంజీవా సినిమాకు మాటలు అందించాడు త్రివిక్రం. అయితే దర్శకుడిగా మారాక త్రివిక్రం చిరుతో కలిసి పనిచేయలేదు. చిరు త్రివిక్రం కాంబినేషన్ మాత్రం అదిరిపోతుందని చెప్పొచ్చు. త్రివిక్రం మాటలకు చిరు మార్క్ యాక్టింగ్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న త్రివిక్రం త్వరలోనే ఆ సినిమా మొదలుపెడతాడట. ఇక బన్ని తర్వాత లైన్ లో చిరు ఉన్నట్టు తెలుస్తుంది. చిరు, త్రివిక్రం కలిసి చేసే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.