
నాచురల్ స్టార్ నానికి ఈ ఇయర్ అసలేమాత్రం కలిసి రాలేదు. వరుసగా డబుల్ హ్యాట్రిక్స్ తో మంచి జోష్ లో ఉన్న నానికి ఈ ఇయర్ వచ్చిన కృష్ణార్జున యుద్ధంతో పాటుగా దేవదాస్ సినిమాలు నిరాశపరచాయి. ప్రస్తుతం గౌతం తిన్ననూరి డైరక్షన్ లో జెర్సీ సినిమా చేస్తున్న నాని ఆ సినిమా తర్వాత విక్రం కుమార్ డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడని తెలుస్తుంది. నాని, విక్రం కుమార్ కచ్చితంగా క్రేజీ కాంబినేషన్ అని చెప్పొచ్చు.
ఇష్, మనం, 24 సినిమాలతో దర్శకుడిగా తన టాలెంట్ చూపించిన విక్రం కుమార్ అల్లు అర్జున్ తో సినిమా కోసం బాగా ట్రై చేశాడు కాని ఫైనల్ స్క్రిప్ట్ నచ్చకపోవడంతో బన్ని విక్రం తో సినిమా క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు విక్రం కుమార్ నానితో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. అదే కథ చేస్తున్నాడా లేక నాని కోసం కొత్త కథ రాశాడా అన్నది తెలియాల్సి ఉంది.
మైత్రి మూవీ మేకర్స్ నానికి, విక్రం కుమార్ కు అడ్వాన్సులు ఇచ్చి ఉన్న సందర్భంగా ఈ బ్యానర్ లో మూవీ పట్టాలెక్కుతుందట. నాని జెర్సీ షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని. దీనికి సంబందించిన అఫిషియల్ న్యూస్ కొద్దిరోజుల్లో ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.